పెండిగ్‌ బిల్లులు క్లియర్‌.. ..?

హైదరాబాద్‌ జూలై 10, (ఇయ్యాల తెలంగాణ ):   తెలంగాణ సర్కార్‌పై గవర్నర్‌ తమిళిసై మెత్తబడ్డారు. రాజ్‌భవన్‌ ప్రగతిభవన్‌ మధ్య దూరం తగ్గినట్టుగా తాజాగా ఒక పరిణామం స్పష్టం చేసింది. పెండిగ్‌ బిల్లులను జూలై 15లోగా క్లియర్‌ చేస్తామని తెలంగాణ రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడిరచాయి. మున్సిపల్‌, ప్రైవేట్‌ యూనివర్సిటీ బిల్లులు గత కొంత కాలంగా పెండిరగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులను గవర్నర్‌ పెండిగ్‌లో పెట్టడంతో బీఆర్‌ఎస్‌ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.గవర్నర్‌ తమిళిసై తీరుపై తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య ఆ సమయంలో పెరిగిన దూరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా గవర్నర్‌ పెండిగ్‌ బిల్లులను జూలై 15లోగా క్లియర్‌ చేస్తామని స్పష్టం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

గవర్నర్‌ ఆమోదించిన బిల్లులు..       

1) ది తెలంగాణ మోటార్‌ వెహికల్‌ ట్యాక్సేషన్‌ (సవరణ) బిల్లు`2022

2) ది తెలంగాణ మునిసిపాలిటీస్‌ (సవరణ) బిల్లు`2023

3) ది ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (సవరణ) బిల్లు`2023

పెండిరగ్‌లో ఉన్నవి..

1) ది తెలంగాణ స్టేట్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీస్‌ (ఎస్టాబ్లిష్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) (సవరణ) బిల్లు`2022

2) ది తెలంగాణ మునిసిపల్‌ లాస్‌ (సవరణ) బిల్లు`2022

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....