పాలేరు నుంచి షర్మిల పోటీ అన్నీ స్థానాల్లో YSR తెలంగాణ పార్టీ పోటీ YS షర్మిల

హైదరాబాద్‌ అక్టోబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ):వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ  రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిలా రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది వైఎస్‌ షర్మిలా మాట్లాడుతూ   119 నియోజక వర్గాల్లో మా పోటీ చేస్తుంది.  119 నియోజక వర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని అన్నారు.   బి ఫామ్‌ ల కోసం ధరకాస్తు పెట్టుకోవచ్చు.  నేను పాలేరు నుంచి పోటీ చేస్తానని అన్నారు. రెండో చోట నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్‌ ఉంది.  బ్రదర్‌ అనిల్‌,విజయమ్మ ని కూడా పోటీ పెట్టాలని డిమాండ్‌ ఉంది.   అవసరం అయితే అనిల్‌  పోటీ చేస్తారు. విజయమ్మ సైతం పోటీ చేస్తారు.   కాంగ్రెస్‌ తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అనుకున్నాం.   ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుంది అనుకున్నాం.  ఓట్లు చీలిస్తే కేసీఅర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నాం.   అందుకే కాంగ్రెస్‌ తో చర్చలు జరిపాం.   4 నెలలు ఎదురు చూశాం.  రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకు వస్తమని ఆమె అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....