పార్టీ మారే ప్రసక్తే లేదు BJP జాతీయ ఉపాధ్యక్షురాలు DK అరుణ

హైదరాబాద్‌ అక్టోబర్ 26 (ఇయ్యలతెలంగాణ ):విూడియా లో  తాను కాంగ్రెస్‌ పార్టీ లో చేరుతునట్లు వస్తున్న వార్తలను  తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ లో  చేరే ప్రసక్తి లేదని, కావాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. బిజెపి జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది. మోడీ  నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలి. కనీసం తన స్పందన తీసుకోకుండా వార్త కథనాలు రాయడం సరైంది కాదు .  తన రాజకీయ భవిష్యత్‌ నిర్ణయించాల్సిన హక్కు విూడియాకు ఎవరు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు.   తన పై దుష్ప్రచారం చేసిన విూడియా సంస్థల పై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....