పల్లెల్లో పంచాయతీ Election సందడి !

రంగారెడ్డి, జూలై  30, (ఇయ్యాల తెలంగాణ) : పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటనతో ఆశావాహులలో జోష్‌ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తౌె ఆరు నెలలు అవుతుండగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ల పదవీకాలం ఈనెల ఐదున ముగిసిన విషయం తెలిసిందే, పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి ఏర్పడిరది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆశావహులు ఇప్పటికే ప్రజలను, ఆయా గ్రామాలలో మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. చిన్న శంకరంపేట మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి గతంలో ఉన్న రిజర్వేషన్‌ మారుతి ఎవరు? మారకపోతే ఎవరు? పోటీచేయాలని దీనిపై గ్రామాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.ఒక్కొక్క పార్టీ నుండి ముగ్గురు లేదా నలుగురు ఆశావహులు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆరు గ్యారెంటీల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోపక్క బీఆర్‌ఎస్‌ సైతం ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని పంచాయతీలో గెలవాలని చూస్తోంది అనే సమాచారం. అలాగే మెదక్‌ ఎంపీ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్‌ రావు గెలవడంతో బీజేపీ పార్టీకి చెందిన యువత కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో నిలబడి గెలవాలని రెండు మూడు రోజుల క్రితం మండలం లో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి చర్చించినట్లు తెలిసింది. తాజా, మాజీలు కొత్త వ్యక్తులు సర్పంచ్‌ కొరకు పోటీ చేసేందుకు నిమగ్నమై ఉన్నారు. స్థానిక సంస్థలు ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది ముఖ్యంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచడం కోసం బీసీ జన గణన చేస్తామని ప్రకటించింది ప్రస్తుతం రిజర్వేషన్లు పరిశీలిస్తే పదిహేను శాతం ఎస్సీలకు ఆరు శాతం ఎస్టీలకు 24 శాతం బీసీ రిజర్వేషన్లను ఇప్పటికే అమలై ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలి.ఈ క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఆ పంచాయతీలకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి.ఆరు నెలల నుంచి పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలకు కావలసిన నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామపంచాయతీలో ప్రజలకు కల్పించాల్సిన సదుపాయాలకు కావలసిన నిధులు రాకపోవడంతో పాలన కుంటుపడుతుంది. సీఎం రేవంత్‌ రెడ్డి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఆగస్టు మొదటి వారం లోపు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, అదికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో, గ్రామాలలోని పంచాయతీ ఎన్నికలు త్వరలో రానున్నట్లు తెలుసుకున్న ఆశావహులు గ్రామాలలో ఎన్నికల సందడి నెలకొంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....