పండుగ పూట కాపలా కాస్తుంటాము

హైదరాబాద్‌, అక్టోబరు 21, (ఇయ్యాల తెలంగాణ );ఎలాంటి పండుగనైనా ప్రజలు కుటుంబాలతో గడిపితే పోలీసు సిబ్బంది మాత్రం రోడ్డుపై పెట్రోలింగ్‌ చేస్తూ ఉంటారని డీజీపి అంజనీ కుమార్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు జెండా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశవ్యాప్తంగా 189 మంది పోలీస్‌ సిబ్బంది వీరమరణం పొందారని అన్నారు. 189 మంది సిబ్బందికి నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. దేశంలోని పోలీస్‌ శాఖలో ఉన్న పలు విభాగాలకు లీడర్‌ గా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ పోలీసులు నెంబర్‌ వన్‌ స్థలంలో ఉన్నారని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటులో కూడా దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో తెలంగాణ ఉందని అన్నారు. భరోసా సెంటర్‌ దేశంలో రోల్‌ మోడల్‌ గా మారిందన్నారు. దేశ ప్రజలు ఇండల్లో ప్రశాంతంగా పండుకుంటున్నారంటే రోడ్డుపై పోలీసుల విధి నిర్వహణే కారణమని తెలిపారు.ఎలాంటి పండుగనైనా ప్రజలు కుటుంబాలతో గడిపితే పోలీసు సిబ్బంది మాత్రం రోడ్డుపై పెట్రోలింగ్‌ చేస్తూ ఉంటారని తెలిపారు. కోవిడ్‌ సమయంలో ప్రజలంతా కుటుంబసభ్యులతో ఇళ్ళల్లో ఉంటే, కానిస్టేబుల్‌ సిబ్బంది మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపై విధి నిర్వహణ చేశారని గుర్తు చేశారు. విధి నిర్వహణ ఛాలెంజ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్న సిబ్బందికి సెల్యూట్‌ చేస్తున్నానని అంజనీకుమార్‌ తెలిపారు. గొప్ప విజయం గొప్ప త్యాగం నుండి వస్తుందని అన్నారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీకుమార్‌ నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. పోలీసు అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ‘అమరులువారు’ పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసు కవాతు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది మరణించిన 189 మంది పోలీసు అధికారుల పేర్లను చదివి వారి సేవలను స్మరించుకున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....