నేడు Telangana విమోచన దినోత్సవం

`నిజాం నవాబు తోకముడిచి భారత్‌కు లొంగిపోయిన రోజు

అది పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దినం సొంతగడ్డపైనే పరాయివారిగా బతుకులీడుస్తున్న ప్రజలు జరిపిన యుద్ధం భూస్వాముల దౌర్జన్యాలు, నిజాం రాజరిక దుర్మార్గ వ్యవస్థ, రజాకర్ల అమానుషాలు తెలంగాణను అణువణువునా పట్టిపీడిరచిన అన్ని దుర్మార్గాల నుంచి హైదరాబాద్‌ సంస్థానం విముక్తి పొందడానికి జరిగిన మహా సంగ్రామమది భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థాన విలీనం చరిత్రాత్మకమైన ఉదంతం నిజాం నవాబు తోకముడిచి భారత్‌కు లొంగిపోయిన సందర్భం అసలు సెప్టెంబర్‌ 17న ఏం జరిగింది? హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో ఎలా విలీనమైంది? ఓసారి గుర్తు చేసుకుందాం.నిజాం కబంధ హస్తాల నుండి హైదరబాదు సంస్థానం విముక్తిపొందిన రోజును తెలంగాణ విమోచన లేదా విలీన దినం గా పాటిస్తారు.1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్‌ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్‌ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్‌ నవాబు విూర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్‌ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. ఆనాటి హైదరాబాద్‌ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్‌ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్‌, జాగీర్దార్‌, దొరల వెట్టి చాకిరిలో గ్రావిూణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు.. 

ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్భలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢల్లీి ఎర్రకోటపై అసఫ్‌ జాహీ పతాకాన్ని గురేస్తానని విర్ర వీగాడు.. ఇలాంటి పరిస్థితిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్‌ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. ఈ సంస్థలన్నింటినీ నిషేధించాడు ఉస్మాన్‌ అలీఖాన్‌. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్‌ కంతిలా మారిన హైదరాబాద్‌ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి, సర్దార్‌ వల్లభాయి పటేల్‌ నిర్ణయించుకున్నారు.. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్‌ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్‌ 13న భారత సైన్యం ఆపరేషన్‌ పోలో పేరిట హైదరాబాద్‌ సంస్థానాన్ని ముట్టడిరచింది. దీనికి పోలీస్‌ యాక్షన్‌ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్‌ వాసులకు స్వాతంత్య్రం వచ్చింది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడిరది. అందుకే సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....