నులి పురుగుల నివారణ అందరి బాధ్యత ! Municipal చైర్‌ పర్సన్‌ జ్యోతి

జగిత్యాల, జూన్ 20 (ఇయ్యాల తెలంగాణ) : నులిపురుగుల నివారణ అందరి బాధ్యత అని   జగిత్యాల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అడువాల జ్యోతి` లక్ష్మణ్‌ అన్నారు. గురువారం పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో చైర్‌ పర్సన్‌, విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు ..

ఈ సందర్భంగా ఆమే మాట్లాడారు విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుతోపాటు అన్నిరంగాల్లో రాణిస్తారని తెలిపారు. నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలను ప్రతీ విద్యార్థికి తప్పనిసరిగా వేయాలన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తోపాటు చుట్టూ ఉన్న వారినిసైతం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సమియోద్దిన్‌, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....