వివరాలు సేకరించాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశం
హైదరాబాద్ ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. వివరాలు సేకరించాలని మేయర్ విజయలక్ష్మి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువకాలం పనిచేస్తున్న, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారి లెక్కలు తయారు చేయాలని మేయర్ ఆదేశించారు. లిస్ట్ రెడీ అయ్యాక ప్రభుత్వానికి అందించాలని లేదా ఇతర శాఖలకు పంపాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. మరోవైపు జీహెచ్ఎంసీలో పని చేస్తున్న 45 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. కార్పొరేటర్లకు, ప్రజాసమస్యలపై రెస్పాన్స్ అవ్వని ఆఫీసర్స్‌ను బదిలీ చేస్తూ ఈ తీర్మానం చేసింది.