నిర్లక్ష్యం పై సజ్జనార్‌ TWEET

హైదరాబాద్‌, జూలై 3, (ఇయ్యాల తెలంగాణ ); నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాలలో ఇతరి ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి ఓ ఘటనపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పందించారు.‘ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కు మరొకరి ప్రాణం బలైంది. కారుతో పాదచారుడిని ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా కారు డ్రైవర్‌ వెళ్లిపోయాడు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఈరోజు జరిగిన ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందారు. రోడ్లపైకి వాహనాలతో వచ్చి ఇష్టారీతిన నడుపుతూ  అమాయకపు ప్రాణాలను తీయడం ఎంత వరకు సమంజసం!?’ అని టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ప్రజల ప్రాణాలు విలువైనవి అని, నిర్లక్ష్యంతో డ్రైవింగ్‌ చేసి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను బలిగొనడం సమంజసం కాదని తరచూ సజ్జనార్‌ ఎక్స్‌ ఖాతాలో వీడియోలు, సమాచారం పోస్ట్‌ చేస్తుంటారు. తాజాగా సజ్జనార్‌ షేర్‌ చేసిన వీడియో సోషల్‌ విూడియాలో ట్రెండ్‌ అవుతోంది. దేశ వ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి కొత్త చట్టాలు అమలులోకి రావడం తెలిసిందే. భారతీయ న్యాయ సన్హిత కింద మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలు అమలోకి వచ్చాయి. దాని ప్రకారం ఆన్‌ లైన్‌లో ఎక్కడినుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. అరెస్టుకు ముందు తమ అరెస్ట్‌ విషయాలను వెల్లడిరచే అవకాశం ఉన్నట్లు చట్టాల్లో ఉంది. డ్రైవింగ్‌ కు సంబంధించి సైతం చట్టాలు కఠినం చేశారు. ప్రమాదాలు తగ్గించాలని, ప్రజలకు భద్రత పెంచాలని మైనర్లు డ్రైవింగ్‌ చేస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. వయోజనులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసినా, మద్యం తాగి వాహనం నడిపినా కొత్త చట్టాల ప్రకారం భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....