నిర్మాణ కూలీలుగా మారిన విద్యార్దులు

నల్గోండ సెప్టెంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ): నల్లగొండ జిల్లా  కనగల్‌ మండలంలోని చర్లగౌరారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాద్యాయుల నిర్వాకం బయట పడిరది.  పలకా బలపం పట్టించాల్సిన చిట్టి చేతులతో  ఏకంగా ఇటుకలు మోయించారు సదరు ఉపాద్యాయులు. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సింది పోయి,   వారిని కూలీలుగా మార్చారు. కాసులకు కక్కుర్తి పడి  చిన్నారులను బానిసలను చేశారు.  మానవత్వం మరిచి, సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ప్రహరీ గోడ నిర్మాణానికి వచ్చిన ఇటుకలను మోయడానికి.. కేవలం 500 రూపాయల ఖర్చు చేస్తే కూలీలు దొరికే వారు. ఆ డబ్బు మిగిలించు కోవడం కోసం.. ఏకంగా విద్యార్థులనే కూలీలుగా మార్చారు ప్రభుత్వ ఉపాద్యాయులు. ఎంతగానో కలచి వేస్తున్న ఈ దృశ్యాలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యాయి. విద్యార్థులతో వెట్టి చాకిరి చేయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ పేరెంట్స్‌ నుంచి వినబడుతుంది. కలచి వేస్తున్న ఘటనను బాలల హక్కుల సంఘాలు, పేరెంట్స్‌ తీవ్రంగా ఖండిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....