నిజమైన రైతులకే రైతుభరోసా అందాలి : మంత్రి తుమ్మల

ఖమ్మం న జూలై  10 (ఇయ్యాల తెలంగాణ );జమైన రైతులకే రైతుభరోసా అందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా నుంచి రైతుభరోసా సదస్సులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో రైతుభరోసా విధివిధానాలపై అభిప్రాయాల సేకరించినట్లు తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అభిప్రాయాలు సేకరణ జరిగిందని వెల్లడిరచారు.ప్రజల ఆలోచనల మేరకు ప్రభుత్వం ముందుకెళ్తుందని తుమ్మల అన్నారు. గతంలో జరిగిన ఆర్థిక నష్టాన్ని ప్రజలు గమనించారని వ్యాఖ్యానించారు. చిన్న, సన్నకారు రైతులకు చేయూత నిచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. రైతుల అభిప్రాయాల సేకరణ తర్వాతే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....