హైదరాబాద్ అక్టోబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ):సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సమాచార హక్కు చట్టం జాతీయ అవగాహన సదస్సు గురువారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండా ప్రకాష్ ముదిరాజ్ హాజరైనారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అవినీతిపరుల అటకట్టించేందుకు దోహద పడుతుంది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు తనకు కావలసిన ఏ సమాచారం అయినా పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు.
సమాచార హక్కు చట్టం ఎంత గొప్పదో అంత నిర్లక్ష్యం చేయబడ్డది. ఏ రంగం లో నైనా చేస్తున్న పని ప్రజలకు స్పష్టంగా తెలియాలి . ప్రభుత్వ పరంగా జరిగేది ఏదైనా ప్రతీ పౌరుడికి తెలుసుకునే బాధ్యత ఉంటది. సమాచార హక్కు చట్టం కింద సమాచారం సేకరించడం ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో క్రియా శిలకంగా ఉంటుంది. చాలా విషయాలలో సమాచార హక్కు చట్టంఅనగానే చాలామందికి భయం ఉంటది. ప్రజలు చైతన్యవంతం అయితే తప్ప సమాజంలో మార్పు రాదని అన్నారు. సమాచార హక్కు చట్టం గురించి వీలైనన్ని సదస్సులు జరిపి అవగాహన కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సమాచార హక్కు చట్టం గురించి నేర్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి చైర్మన్ కేశవులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టిఐ చీఫ్ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, జస్టిస్ గ్రంధి భవాని ప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ ముక్తేశ్వర్ రావు, రిటైర్డ్ సిబిఐ అధికారి బాలకిషన్ రావు, రాష్ట్ర కన్వీనర్ ఉషారాణి, ఐఎఫ్ టి యు అధ్యక్షులు వెంకటేశ్వర్లు, , మిని అంగన్ వాడి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ులు సామ్యూల్, ముస్లింల మైనారిటీ నాయకులు రసూల్,మస్తానయ్య, ఖాజాహుస్సేన్, బి.సి సంఘ నాయకులు బోలా నారాయణ, జి.నాగేంద్ర, ఆర్.టి.ఐ సీనియర్ ఆక్టివిస్ట్ రాజగోపాల్ రెడ్డి,డి.వై.యఫ్. వై నాయకులు జి.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.