హైదారాబాద్ జులై 31, (ఇయ్యాల తెలంగాణ ) :ధరణి పోర్టల్ , అసైన్డ్ భూముల అన్యక్రాంతంపై బీఎస్పీ చీఫ్ థిస్ RS ప్రవీణ్ కుమార్. బహుజన యాత్ర లో ఉండడం వలన ఇన్ని రోజులు హైదారాబాద్ కు రాలేక పోయాము. జనాలలో తిరిగినప్పుడు జనాలు చెప్పిన కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకు వస్తాను.
*భారీ వర్షాలతో జనలు తీవ్రంగా నష్ట పోయారు..నష్ట పోయిన వారికి డబ్బులు ఇవ్వాలి.
* మోరంచ పల్లి,కొండాయి గ్రామం కు వంద కోట్లు ఇవ్వాలి..
* హైదారాబాద్ బడా బాబుల కోసం కేబుల్ బ్రిడ్జి లు కడుతున్నారు..చాలా గ్రామాల్లో ఉన్న వాగులకు బ్రిడ్జి లు కట్టడం లేదు..
చనిపోయిన వారంతా వాగులు దాటుతూ చనిపోయిన వారే.
*గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ, అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజు కుంటుంది.
*30 వేల ఎకరాలు పేద ప్రజల దగ్గర నుండి గుంజు కుని బడా బాబులకు ఇస్తుంది…
*రాష్ట్రంలో బహుజన వాదం బలపడడం తో కెసీఆర్ తట్టుకోలేక పోతున్నారు…
అందుకే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ను అంబేడ్కర్ మనుమడిని తీసుకు వచ్చి నేను బహుజన వాదిని అని కెసీఆర్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత.బహుజనుల దగ్గర నుండి ప్రభుత్వం గుంజుకున్న అసైన్డ్ భూములను మళ్ళీ మళ్ళీ రైతులకు పంచుతాము. అసైన్డ్ భూముల హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీఎస్పీ నాయకుల పై పెట్టిన కేస్ లను ఎత్తివేయాలి..కేస్ లకు మేము భయ పడము.*రైతుల దగ్గర భూములను గుంజుకుని బడా బాబులకు అమ్ముకుంటున్నారు, గత ప్రభుత్వాలు కూడా పేదలకు బిస్కెట్లు వేసి వేల కోట్ల భూములు కాజేశరు.రైతులతో అధికారులు సెటిల్ మెంట్ చేసుకొని ఎకరాల భూములు తీసుకొని, ఐదు, ఆరు వందల గజాలు ఇచ్చి మిగిలిన భూములు ప్రైవేటు వ్యక్తులకు కోట్ల రూపాయలకు అప్పగిస్తున్నారు. ఆంధ్ర పెత్తం దారుల వేసెల్ల గ్రూపు రైతుల వద్ద పదహారు వేలకు గజం గా కొనుగోలు చేసి లక్ష రూపాయలు గజం అమ్ముకుంటున్నారు.అసైన్డ్ భూములు లే అవుట్ చేసుకోమని ఏ చట్టం చెబుతోంది, రైతులకు ఇచ్చిన రెండు మూడు వందల గజలలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు బహుజన రాజ్యంలో రైతులకు ఆ భూములు తిరిగి ఇస్తాం పేదల నోట్లో మట్టి కొట్టి వారి ఆస్తులు గుంజుకొని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని కోట్లుగడిస్తున్నారు, ఇందులో కేటీఆర్ హస్తం ఉంది. అసైన్డ్ భూము లలో ఎవరి ఫామ్ హౌస్ లు ఉన్నాయో బయట పెట్టాలి. కోర్టు కు సైతం వెళ్తాం..న్యాయ పోరాటం చేస్తాం.అన్యాక్రాంతం భూములు ప్రభుత్వం గుంజుకుంది ప్రభుత్వం మీద పిల్ వేస్తాం.అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలు చేసేవారికి హెచ్చరిస్తున్నాం దయచేసి వేలం వేయడం ఆపేయాలి, వేలం వేసిన భూములు లాక్కొని పేద ప్రజలకు తప్పక ఇస్తాం ఈ భూముల కోసం ఎంతటి పొరటనికైన బీఎస్పీ సిద్దంగా ఉంది బాడంగ్ పేట భూములు 40 ఎకరాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తన అనుచరులు ఆక్రమణ చేస్తుంటే అడ్డుకున్న వారి మీద దాడులు చేసి కేసులు పెడుతున్నారు. అసైన్డ్ భూములు దున్నుకుంటున్న రైతులకు చాలా రాష్ట్రాల్లో రెగ్యులర్ ఏజ్ చేసి పట్టాలు ఇస్తున్నారు..మన రాష్ట్రం లో కూడా అసైన్డ్ భూములకు రెగ్యులర్ ఏజ్ చేసి పట్టాలు ఇవ్వాలి, ప్రభుత్వ భూములను వాళ్ళ పార్టీ ఆఫీస్ లకు ఇస్తున్నారు. అసైన్డ్ భూములను ప్రయివేట్ వ్యక్తులకు ఇచ్చిన వాటి పై విచారణ జరిపించాలి..లేకపోతే మేము కోర్టుకు వెలుతాము.కేటీఆర్, కెసీఆర్,కవిత ఫామ్ హౌస్ లలో డంపింగ్ యార్డ్ లు,స్మశాన వాటిక లు కడితే ఊరుకుంటారా. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను గుంజుకుని స్మశాన వాటిక లు,డంపింగ్ యార్డు లు ఎందుకు కడుతున్నారు.
GO 46 ను సవరణ చేయాలి.
లిక్కర్ స్కాం ,TSPSC లీకులు ఎమ్మేల్యేల ఆక్రమణల కబ్జాల మీద, వరదల మీద ఎందుకు సీఎం కెసీఆర్ మాట్లాడడం లేదు.. పంచాయతీ కార్మికుల సమస్యల మీద కెసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. బుద్వెల్ లో ప్రభుత్వ భూములను హెచ్ఎండిఏకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికల ప్రచారం పోస్టర్ ను ఆవిష్కరించిన బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓటు మాకు. అధికారం మీకు అనే నినాదంతో ముందుకు వెళ్తున్న బహుజన్ సమాజ్ పార్టీ.