దుబాయ్‌ లో ఘనంగా Telangana దశాబ్ది ఉత్సవ సంబరాలు

జగిత్యాల, జూన్‌ 11 (ఇయ్యాల తెలంగాణ) : దుబాయ్‌ లోని ఏటిసాలట్‌ అకాడవిూలో స్పార్క్‌ విూడియా ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో ఆది,సోమ వారాల్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత  అందెశ్రీ హజరై తెలంగాణ ప్రకాష్‌, డైరెక్టర్‌ వినయ్‌ బాబు, నంగి దేవెందర్‌ లతో కలసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగాతెలంగాణ  కళాకారులు సోనీ యాడర్ల, లల్లయిలే మహేష్‌, మా పల్లె శంకర్‌ మరియు దుబాయ్‌ సింగర్‌ మల్లేష్‌ కోరేపుల ఉద్యమ పాటలతో సందడి చేశారు…అనంతరం అందే శ్రీ, దుబాయ్‌ తెలుగు సంఘాల పెద్దలు, వ్యాపారవేత్తలు  ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమానికి సహకారం అందించిన స్పాన్సర్స్‌ కి తోపాటు అతిథులకు, కళాకారులకు ప్రేక్షకులకు స్పార్క్‌ విూడియా అరుణ్‌ సుర్నిడ, రమేష్‌ లావణ్య లు కృతజ్ఞతలు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....