త్వరలో రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి Amit Shah

హైదరాబాద్‌ ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) :  బీజేపీ  చేపట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా  రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఆయన రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆయన రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆయన చివరి సారిగా గతేడాది డిసెంబర్‌ 27న రాష్ట్రానికి వచ్చారు.షా లోక్‌ సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలిచి 35 శాతం ఓట్లు సాధించాలని స్థానిక నాయకత్వానికి అమిత్‌ షా టార్గెట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....