హైదరాబాద్ జూలై 8 (ఇయ్యాల తెలంగాణ ); పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జివొ విడుదల చేసింది. రెండో రోజుల్లో కార్పొరేషన్ ఛైర్మన్లు బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చి 15నే జివోలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. కానీ పార్లమెంట్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇవాళ తిరిగి విడుదల చేశారు.మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్: శోభారాణి, వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్: ఎం వీరయ్య, విత్తనాభివృద్ధి ఛైర్మన్: అన్వేష్ రెడ్డి, ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ: కాసుల బాలరాజు, సంగీత నాట్య అకడావిూ ఛైర్‌పర్సన్: అలేఖ్య పుంజాల, ఎంబిసి కార్పొరేషన్ ఛైర్మన్: జైపాల్, ఆయిల సిడ్స్ అభివృద్ధి సంస్థ ఛైర్మన్: జంగా రాఘవరెడ్డి, బిసి కార్పొరేషన్ ఛైర్మన్: నూతి శ్రీకాంత్, ఎస్‌సి కార్పొరేషన్ ఛైర్మన్: ఎన్ ప్రీతం, ఎస్‌టి కార్పొరేషన్ ఛైర్మన్: బెల్లయ్య నాయక్, గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్: కె తిరుపతి, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్: ఎంఎ జబ్బార్, రాష్ట్ర సహకార సంఘం ఛైర్మన్: మానాల మోహన్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్: నాగేశ్వర్ రావు, ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్: జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మత్ససహకార సమాఖ్య ఛైర్మన్: మెట్టు సాయికుమార్, గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్`రియాజ్ , అటవీ అభివృద్ధి చైర్మన్: పొదెం వీరయ్య, ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్: కాల్వ సుజాత, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్: గురునాథ్ రెడ్డి, సెట్ విన్ ఛైర్మన్: గిరిధర్ రెడ్డి, హస్త కళల అభివృద్ధి ఛైర్మన్: నాయుడు సత్యనారాయణ, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్: అనిల్, టిజిఐఐసి ఛైర్‌పర్సన్: నిర్మలా జగ్గారెడ్డి, వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్: ప్రకాశ్ రెడ్డి, సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ ఛైర్మన్: మన్నె సతీష్ కుమార్, పట్టణ ఆర్థిక మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్: చల్లా నరసింహారెడ్డి,శాతవాహన పట్టాణాభివృద్ధి సంస్థ ఛైర్మన్: కె నరేందర్ రెడ్డి, కాకతీయ పట్టాణాభివృద్ధి చైర్మన్: ఇ వెంకటరామిరెడ్డి, రహదారి అభివృద్ధి సంస్థ ఛైర్మన్: మల్‌రెడ్డి రంగారెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్: పటేల్ రమేశ్ రెడ్డి,తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్: ఎంఎ ఫహిమ్
- Homepage
- Telangana News
- తెలంగాణ వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం
తెలంగాణ వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం
Leave a Comment