తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

 హైదరాబాద్‌ డిసెంబర్‌ 7 (ఇయ్యల  తెలంగాణ ); తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నియమితులయ్యారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తూ కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే కాంగ్రెస్‌ పార్టీ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ బాధ్యతలు నిర్వహించనున్నారు. వికారాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గడ్డం విజయం సాధించారు. 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. 2012లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో టెక్స్‌టైల్స్‌ మంత్రిగా పని చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....