తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీ ఫోకస్‌

హైదరాబాద్‌, ఏప్రిల్ 27 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో సవిూక్షించారు. అన్ని జిల్లాల ఈసీలతో సీఈవో వికాస్‌ రాజ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి వారం పార్టీల ప్రతినిధులతో భేటీలు నిర్వహించి క్లైమ్‌?లు, అభ్యంతరాలను తెలియచేయాలని సీఈవో ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర, జిల్లా స్థాయి మాస్టర్‌ లెవల్‌ ట్రైనర్లను గుర్తించాలని సూచించారు. ఓటరు అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈవీఎంల పనితీరును జూన్‌ 1 నుంచి పరిశీలిస్తామని సీఈవో ప్రకటించారు. ఎలక్టోరల్‌ రోల్‌ను ఏప్రిల్‌ 30 వరకు పూర్తి చేసి ప్రచురించాలని ఆదేశించారు వికాస్‌ రాజ్‌. ఓ వైపు రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతుండగా.. నిర్వహణకు ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఎలక్షన్‌ హీట్‌ మొదలైంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....