తెలంగాణాలో BJP అధికారంలోకి వస్తే BC నేతను CM చేస్తాం

సూర్యాపేట అక్టోబర్‌ 27 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో బీజేపీ ఎన్నికల భారీ బహిరంగ సభ నిర్వహిచింది. ఈ సభలో అమిత్‌ షా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘దళితుడిని సీఎం చేస్తామని చెప్పే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. బీజేపీని గెలిపిస్తే బీసీ నేతను సీఎం చేస్తాం. తెలంగాణకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చేసిందేవిూ లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు కుటుంబ రాజకీయాలే ముఖ్యం. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్‌ లక్ష్యం. రాహుల్‌గాంధీను పీఎం చేయడమే సోనియా లక్ష్యం. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’’ అని అమిత్‌షా తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....