న్యూఢీల్లీ, జూలై 13, (ఇయ్యాల తెలంగాణ ): రాజధాని ఢీల్లీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరద పోటుకు యమునా ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. 45 ఏళ్ల తర్వాత నది నీటిమట్టం 208.30 విూటర్లు దాటింది. వరద పరిస్థితుల దృష్ట్యా ఢల్లీి ప్రభుత్వం అప్రమత్తమైంది.కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) పోర్టల్ ప్రకారం పాత రైల్వే వంతెన వద్ద నీటిమట్టం ఉదయం మొదటిసారి 207 విూటర్ల మార్కును దాటింది. సాయంత్రం రికార్డు స్థాయిలో 208 విూటర్లకు చేరింది. రాత్రి 8 గంటలకు 208.30 విూటర్లకు పైగా పెరిగింది. పాత రైల్వే బ్రిడ్జిపై రాత్రి 10 గంటలకు అత్యధిక నీటి మట్టంతో కొత్త రికార్డు నమోదైందని ప్రభుత్వం తెలిపింది. 1978లో యమునా నది నీటిమట్టం 207.49 విూటర్లకు చేరింది.యమునా నది నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో నది వెంబడి పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారుబోట్ క్లబ్‌కు చెందిన 17 బోట్లు, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ కు చెందిన 28 బోట్లను సహాయక చర్యల కోసం విధుల్లో ఉంచినట్లు ఢల్లీి ప్రభుత్వం తెలిపింది. మొత్తం 45 బోట్లను దించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 12 బృందాలను రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలను గురువారం మూసివేయాలని ఢల్లీి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) విద్యాశాఖ నిర్ణయించింది.ఢల్లీిలో వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సివిల్ లైన్స్ జోన్ లోని లోతట్టు ప్రాంతాల్లోని 10 పాఠశాలలు, షహదారా సౌత్ జోన్ లోని ఆరు పాఠశాలలు, షహదారా నార్త్ జోన్ లోని ఒక పాఠశాలను మూసివేయాలని ఎంసీడీ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నారు.. ఢల్లీి ప్రభుత్వం నది కరకట్టలను బలోపేతం చేస్తోందని, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తోందని రెవెన్యూ మంత్రి అతిషి చెప్పారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని ఢల్లీి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది.యమునా నదిలో వరద పరిస్థితి కారణంగా ప్రజలు విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 1077ను సంప్రదించాలని అథారిటీ జారీ చేసిన సలహాలో పేర్కొందియమునా నది నీటి మట్టం రాత్రి 206 విూటర్ల మార్కును దాటింది, వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రోడ్డు అండ్ రైలు రాకపోకల కోసం పాత రైల్వే వంతెనను మూసివేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఢల్లీి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఢల్లీి జలవనరుల శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విూడియాకు తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఢల్లీిలో యమునా నది నీటిమట్టం అనూహ్యంగా పెరగడానికి పూడిక పేరుకుపోవడం, నదీ గర్భం పెరగడమే కారణమని దక్షిణాసియా నెట్ వర్క్ ఆన్ డ్యామ్స్, రివర్స్, పీపుల్ (ఎస్‌ఏఎన్‌ఆర్పీ) అసిస్టెంట్ కోఆర్డినేటర్ భీమ్ సింగ్ రావత్ తెలిపారు. వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు 22 కిలోవిూటర్ల పొడవునా పూడికతీత, 20కి పైగా వంతెనలు, మూడు బ్యారేజీలు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి.ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదిలో నీటిమట్టం పెరిగింది. వాయవ్య భారతంలో వారాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.