ఏలూరు జులై 7, (ఇయ్యాల తెలంగాణ ):అనునిత్యం వంటలో ప్రధానంగా అందరూ ఉపయోగించే మిర్చి టమాటా ధరలు కొండెక్కడంతో పేద ప్రజలకు మరేం చేయాలో దిక్కుతోచడం లేదని అంటున్నారు. కిలో పచ్చిమిర్చి రెండు వందల రూపాయలు కిలో టమాట వంద రూపాయలు ఇలా అన్ని రకాల కూరగాయలు ధరలు మండుతుండడంతో రైతు బజారుకు వెళ్ళినవారు ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్లాల్సి వస్తుందని పలువురు అంటున్నారు. దుకాణాల్లో కూరగాయలు కొన్న నాథుడే ఉండటం లేదని దుకాణదారులు వాపోతున్నారు రోజురోజుకీ కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. తప్ప ఏమాత్రం తగ్గడం లేదని ప్రజలు అంటున్నారు కూరగాయల ధరల కన్నా చికెన్ కోడిగుడ్డులు తరాలు తక్కువగా ఉన్నాయని పలువురు అంటున్నారు. శాకాహారులు మాత్రం విధి లేని పరిస్థితుల్లో పావు కిలో చొప్పున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఏది ఏమైనా కూరగాయల ధరలు తగ్గేది సామాన్య మధ్యతరగతి ప్రజలు బాధలు పోయేది ఎప్పుడు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.