డబుల్‌ మర్డర్‌ కేసులో నిందితులకు జీవత ఖైదు

 

రాచకొండ అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ):ఇబ్రహీంపట్నం లో సంచలనం సృష్టించిన డబుల్‌ మర్డర్‌ కేసులో నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసు తీర్పుపై రాచకొండ పోలీసు కమిషనర్‌  డీఎస్‌ చౌహన్‌ స్పందించారు. 2022  ఇబ్రహీంపట్నం లో  రియాల్టర్‌ డబుల్‌ మర్డర్‌ కేసులో  ముగ్గురు  నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టుజీవిత ఖైదు విధించింది. సివిల్‌ డిస్ఫూట్‌ లో  డాక్యుమెంట్లు తారుమారు చేసిన ముగ్గురు నిందితులు కల్సి ఇద్దరిని శ్రీనివాస రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి లను  హత్య చేసినందుకు నిందితులు  కుట్ర పన్నినట్లు అయన అన్నారు. నిందితులు మట్టరెడ్డి, ఖజమైనోద్దీన్‌, బిక్షపతి లకు జీవిత ఖైదు పడిరది. బాధితులకు న్యాయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నిందితులు  బీహార్‌ నుండి  ఆర్మ్‌ తీసుకొచ్చి హత్య చేసారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఏసీపీ శ్రీధర్‌ రెడ్డి ని సీనీ  ప్రశంసించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....