ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌…

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్‌కు.. ఇవాళ మరో వంతెన అందుబాటులోకి వచ్చింది.. వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్‌ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. 2.25 కిలోవిూటర్లు ఉన్న ఫోర్‌ లైన్‌ స్టీల్‌ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు 450కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. వంతెన అందుబాటులోకి రావడంతో వీఎస్‌టీ జంక్షన్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, ఇందిరాపార్క్‌ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. స్టీల్‌ బ్రిడ్జి నిర్మించిన మార్గంలో రోజు లక్ష వాహనాలు నడుస్తూ ఉంటాయి. సాధారణంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ విూద

 నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వె?పు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. వాహనాల డెన్సిటీ ఎక్కువ ఉండటంతో పాటు జంక్షన్లు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌ టెన్షన్‌ షరామాములే. స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణంతో లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు. అంటే అరగంట జర్నీలో 25 నిమిషాల సమయం ఆదా కానుంది. దీనిపై వాహనాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఎస్‌ఆర్‌డీపీలో 48 ప్రాజెక్టులు చేపట్టగా.., ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులయ్యాయి. పూు ఫ్లై ఓవర్‌ 36వది. అయితే, వాటిలో 19 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్‌యూబీ, ఒక కేబుల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట రహదారి, ఓఆర్‌ఆర్‌ మెదక్‌ రోడ్‌ ఉంది. 20వ ఫ్లై ఓవర్‌గా ఈ స్టీల్‌ బ్రిడ్జి నిలవనుంది. ూఖీఆఖలో ఫ్లై ఓవర్‌ అవసరాన్ని బట్టి స్టీల్‌ను

 వినియోగించారు. బంజారాహిల్స్‌ శ్మశాన వాటిక, మల్కం చెరువు సవిూపంలో చేపట్టిన వంతెనకు కొంత మేరలో స్టీల్‌ వినియోగించగా.. ఈ ఫ్లై ఓవర్‌కు దాదాపు 20 మె ట్రిక్‌ టన్నుల ఉక్కును వాడారు. దక్షిణాదిన మొదటి పొడవైన వంతెన ఇది కావడం గమనార్హం. అంతే కాకుండా జీహెచ్‌ఎంసీ చరిత్రలో భూసేకరణ లే కుండానే నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు ఇదే. హైదరాబాద్‌లో మై ట్రో రైల్‌ మార్గం విూదుగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ కావడం మరో విశేషం. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌, తార్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్‌పేట, రామంతపూర్‌, ఉప్పల్‌ విూదుగా వరంగల్‌ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభతరం అవుతుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....