టెర్రర్‌ ముఠాలకు సైబర్‌ చీటింగ్‌ డబ్బులు

 

హైదరాబాద్‌, జూలై 22, (ఇయ్యాల తెలంగాణ ):అతి పెద్ద సైబర్‌ క్రైమ్‌ ఫ్రాడ్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడిరచారు. గ్రవాదులు మన వేలుతో మనకన్నునే పొడుస్తున్నారు.. ! మన డబ్బును దోచుకుని మనపైనే దాడులకు పెట్టుబడిగా వాడుకుంటున్నారు. ఇలాంటి ఓ ఉగ్రకోణమే సైబరాబాద్‌ పోలీసులు బయటపెట్టారు. పెట్టుబడుల పేరుతో మోసమే కాదు.. అంతకుమించిన ఉగ్ర కోణం వెలుగులోకి వచ్చింది. రూ. 712 కోట్ల స్కామ్‌తో పాటు భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉగ్ర కోణం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.ముందుగా విూకో మెయిల్‌ వస్తుంది. అందులో ఓ టాస్క్‌ ఉంటుంది. అది పూర్తి చేస్తే అంతకంతా లాభం. కానీ.. ఆ టాస్క్‌ పూర్తి చెయ్యాలంటే ముందుగా మనమే పెట్టుబడి పెట్టాలి. మొదట పదివేలు పెడతాం. వాళ్లు కూడా నిజంగానే లాభం చూపిస్తారు. ఈసారి పదిలక్షలు పెడతాం. అంతా స్వాహా. ఇలా దేశంలో 15వేల మంది మోసపోయారు. వాళ్లలో ఇప్పటికే లక్షలు సంపాదిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కూడా ఉన్నారు. సోషల్‌ విూడియాను అడ్డాగా చేసుకొని వందల కోట్లు దోచేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15 వేల మంది వీరి బారిన పడి లక్షల్లో నష్టపోయారు. మరికొందర్ని మోసం చేసే లోపు వీళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో చేస్తున్న పనితోపాటు అదనపు ఇన్‌కం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. పెరిగిపోతున్న ఖర్చులు కావచ్చు ఇంకా సంపాదించాలన్న ఆలోచన కావచ్చు కానీ ఇలాంటి వాళ్లే ఈ సైబర్‌ కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్లే ఈ సైబరాసూరులకు ఆహారంగా మారుతున్నారు.మొదట్లో ఆన్‌లైన్‌లో టాస్క్‌ల పేరుతో ఈ సైబర్‌ నేరగాళ్లు కొన్ని లింక్‌లు పంపిస్తారు. సోషల్‌ విూడియా ప్లాట్‌ఫామ్స్‌ వీళ్ల నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌, టెలిగ్రామ్‌ ద్వారా తమ మోసాలను స్టార్ట్‌ చేస్తారు. టాస్క్‌ ఓరియెంటెడ్‌ జాబ్స్‌ అని చెప్పి మొదలు పెడతారు. అందర్నీ నమ్మించేందుకు మొదట్లో చిన్న చిన్న అమౌంట్లు వేస్తారు. నమ్మకాన్ని కలిగిస్తారు. అక్కడే నేరగాళ్లు తమ ట్రిక్‌ను ఉపయోగిస్తారు. టాక్స్‌ ఇష్యూ రాకుండా ఉండేందుకని చెప్పి డవ్మిూ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తారు. అలా చేస్తే ట్యాక్స్‌ తక్కువ పడుతుందని కలరింగ్‌ ఇస్తారు. చేస్తున్న పనికి మరింత డబ్బులు రావాలంటే కొంత అమౌంట్‌ పే చేయాలని కూడా చెప్తారు. అలా దాని కొంత అమౌంట్‌ తీసుకుంటారు. చేస్తున్న పనికి వచ్చే డబ్బులను వాళ్లు క్రియేట్‌ చేసన డమ్మి అకౌంట్‌లో జమ చేస్తున్నట్టు కట్టు కథలు చెప్తారు. ఆ అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ని కూడా చూపిస్తారు. ఆ అమౌంట్‌ డ్రా చేసుకోవాలంటే మాత్రం కొంత ట్యాక్స్‌ కట్టాలనో ఇంకొకటనో చెప్తారు. ఇలాంటి వీళ్ల మాయమాటలు నమ్మి దేశవ్యాప్తంగా 15 వేల మంది బాధితులు 712 కోట్లు పోగొట్టుకున్నారు. అమాయకులే కాకుండా హై లెవెల్‌ పొజిషన్‌లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్‌ కూడా వీరి బాధితులే. వీళ్లంతా చైనా దుబాయ్‌ కేంద్రంగా మోసాలు చేస్తున్నారు. అక్కడి నుంచి ఆపరేట్‌ చేసే కొందరు కేటుగాళ్లు ఇక్కడ తమ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వారి ద్వారా మిగతా కథను నడిపిస్తున్నారు. స్థానిక భాషలు మాట్లాడుతూ నిండా ముంచుతున్నారు. షెల్‌ కంపెనీలు, బ్యాంక్‌ అకౌంట్స్‌ ఓపెన్‌ చేసి.. వచ్చిన డబ్బును చైనా, దుబాయ్‌కు పంపిస్తున్నారు. అకౌంట్స్‌లో ఉన్న మనీని క్రిప్టో కరెన్సీ ద్వారా ట్రాన్స్ఫర్‌ చేసుకుంటున్నారు సైబర్‌ నేరగాళ్లు. శివకుమార్‌ అనే ఓ వ్యక్తి ఇచ్చిన కంప్లెయింట్‌ ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. నిందితులకు చెందిన 48 అకౌంట్స్‌లో 584 కోట్లు జమయ్యాయి. మరో 128 కోట్లు ఇతర అకౌంట్స్‌లో డిపాజిట్‌ అయ్యాయి. ఫేక్‌ పేపర్స్‌తో లక్నోలో 33 షెల్‌ అకౌంట్స్‌, 65 బ్యాంక్‌ అకౌంట్స్‌ ఓపెన్‌ చేశారు కేటుగాళ్లు. ఫ్రాడ్‌ చేసిన డబ్బును ఈ షెల్‌ కంపెనీలు, అకౌంట్స్‌లో డిపాజిట్‌ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫ్రాడ్‌ చేసిన డబ్బుని క్రిప్టో కరెన్సీగా ట్రాన్స్ఫర్‌ చేసుకుని దుబాయ్‌, చైనాలో విత్‌ డ్రా చేసుకుంటున్నారు. చైనా, దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితులకు ఇండియాలో కొందరు ఏజెంట్లు సహకరిస్తున్నారు. ఇప్పుడు అలాంటి 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్‌ ఫ్రాడ్‌ చేసిన డబ్బుని క్రిప్టో కరెన్సీకి మార్చి ఆ క్రిప్టో కరెన్సీని హిజ్బుల్లాకి సంబంధించిన టెర్రర్‌ మాడ్యూల్‌కి ట్రాన్స్ఫర్‌ అయినట్లు గుర్తించారు. ఇక్కడ ఫ్రాడ్‌ చేసిన డబ్బును టెర్రరిస్టులకు ఫైనాన్స్‌ చేసే అవకాశం కూడా ఉంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....