టీసీ బుక్క్‌ లేవు.. నెలాగండి

హైదరాబాద్‌, జూలై 10, (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పేద పీట వేస్తోందని ఎమ్మెల్యేలు, మంత్రులు పదే పదే చెబుతున్నా వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఓ విద్యార్ధి ఇటీవలే హైదేరాబాద్‌ బహదూర్‌ పుర కేజీబీవీలో 8 వ తరగతి వరకు చదువుకొని 9వ తరగతికి మరో పాఠశాల్లో చేరేందుకు టీసీకి అప్లై చేసుకుంది. అయితే పాఠశాల ప్రిన్సిపాల్‌ తమ పాఠశాలలో టీసీ బుక్‌ అయిపోయిందని ఉన్నతాధికారులకు చెప్పామని, అక్కడ నుండి టీసీ బుక్‌ లు రావడానికి నెల సమయం పడుతుందని చెప్పడంతో ఆ విద్యార్థిని ఏమి పాలుపోలేని స్థితిలో ఉండిపోయింది.ఆ విద్యార్థినికి 9వ తరగతి మరో పాఠశాల్లో చేరేందుకు ఆ పాఠశాల యాజమాన్యం టీసీ కావాలని కోరడంతో ఆ విద్యార్థిని తిరిగి కేజీబీవీ ప్రిన్సిపాల్‌ ను మరో సారి వేడుకొంది. దీంతో ప్రిన్సిపాల్‌.. సదరు పాఠశాలకు ఒక లేఖను పంపారు. తమ పాఠశాలలో టీసీ బుక్‌ వచ్చినంత వరకు అడ్మిషన్‌ కు అనుమతించండి అంటూ సిఫారసు లేఖ రాయడం గమనార్హం. రాష్టంలో విద్యావవస్థ దుస్థితికి ఈ ఘటన అద్దంపడుతుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....