టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో చేరికలు

హైదరాబాద్‌, జూన్ 21 (ఇయ్యాల తెలంగాణ) : టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నిర్మల్‌, కొడంగల్‌, గజ్వేల్‌, మానకొండూరు నియోజకవర్గాల నుంచి వచ్చినవారు కాంగ్రెస్‌ లో చేరారు. కాంగ్రెస్‌ లో చేరిన వారిలో  కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండల బీఆరెస్‌ కార్యకర్తలు వున్నారు. బీజేపీ నుంచి తిరిగి నిర్మల్‌ పట్టణానికి చెందిన నేతలు కాంగ్రెస్‌ లో చేరారు. బీఆరెస్‌ నుంచి  గజ్వేల్‌ నియోజవర్గానికి చెందిన పలువురు బీఆరెస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్‌ఆరు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన గన్నేరువరం మండలం మైలారం, చొక్కారావుపల్లి,  సాంబయ్యపల్లి సర్పంచులు, గన్నేరువరం ఎంపీటీసీ, ఖాసీంపేట ఉపసర్పంచ్‌, పలువురు కార్యకర్తలు బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్‌ లో చేరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....