జూలై, 1న నిర్విహించే గ్రూప్‌ ` 4 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం

   

నాగర్‌ కర్నూల్‌ జూన్ ,30,(ఇయ్యాల తెలంగాణ ):  జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్‌ కుమార్‌

నాగర్‌ కర్నూల్‌ జిల్లా నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో జూలై, 1న నిర్విహించే  గ్రూప్‌ ` 4 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్‌ కుమార్‌ అన్నారు.    శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గ్రూప్‌ `4 నిర్వహణ తీసుకోవాల్సిన జాగ్రత్తల పై  జూమ్‌ విూటింగ్‌ నిర్వహించగా జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివరిస్తూ నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో గ్రూప్‌ 4 పరీక్షలు 16632 మంది అభ్యర్థులు  పరీక్షకు హాజరు కానున్నారని, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని సదుపాయాలతో కూడిన  50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించేందుకు అనుభవజ్ఞులైన చీఫ్‌ సుపరిండెంట్‌ లు, లైజన్‌ ఆఫీసర్లు, రూట్‌ అధికారులను నియమించుకోవడం జరిగిందన్నారు.  ఇన్విజిలేటర్లకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి నియమ నిబంధనల పై అవగాహన కల్పించడం జరిగింది.  ఉదయం 10 గంటలకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 2.30 గంటల నుండి రెండవ పేపర్‌ పరీక్ష ప్రారంభమవుతుందని, దీనికొరకు ఉదయం పరీక్షకు అభ్యర్థులను  ఉదయం 8.30  నుండి 9.45 వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు.  తర్వాత ఒక నిమిషం ఆలస్యం చేసిన పరీక్ష కేంద్రంలో అనుమతించటం జరగదన్నారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30  నుండి 2.15  వరకు అనుమతించడం జరుగుతుందన్నారు.  విద్యార్థులు  వారికి కేటాయించిన పరీక్ష కేంద్రానికి  సకాలంలో చేరుకోవాలని సూచించారు. ఎవరైనా అభ్యర్థులకు హాల్‌ టికెట్‌ పై ఫోటో కనిపించని పక్షంలో 3 పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటోల పై   గెజిటెడ్‌  అధికారితో సంతకం చేయించుకొని తీసుకువెళ్లాలన్నారు.  ప్రతి అభ్యర్థి తన హాల్‌ టికెట్‌ తో పాటు అదనంగా ఒక గుర్తింపు కార్డును విధి గా వెంట తీసుకువెళ్లాలని తెలిపారు. దివ్యంగులు పరీక్ష  స్వయంగా రాయలేని వారి కోసం పరీక్ష కేంద్రంలోనే సహాయకులను  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారు వారి వెంట మరొకరిని తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు.    గ్రూప్‌ 4 పరీక్షకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 08546`230201 కు ఫోన్‌ చేయాలని తెలియజేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు  ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.   రూట్‌ ఆడిసర్లు సకాలంలో చేరుకొని పరీక్షలు సజావుగా నిర్వహించే విధంగా పూర్తి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.  పరీక్ష కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించటం తో  పాటు 144 సెక్షన్‌ అమలు, జిరాక్ష్‌ సెంటర్లు మూసి ఉంచేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలను చేరుకునే విధంగా  ప్రత్యేక రూట్లలో బస్‌ లు నడిపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.       అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ సైతం జూమ్‌ విూటింగ్‌ లో పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....