జీడిమెట్ల డిపోముందు RTC కార్మికుల ధర్నా

మేడ్చల్‌ ఆగష్టు 5, (ఇయ్యాల తెలంగాణ ): ఆర్‌.టి.సి ఎంప్లాయిస్‌ ని ప్రభుత్వం లో విలీనం చేస్తూ రాష్ట్ర సియం కేసిఆర్‌ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర గవర్నర్‌ మోకారిల్లడాన్ని నిరసిస్తూ జీడిమెట్ల డిపోముందు ఆర్‌.టి.సి ఎంప్లాయిస్‌ 91బస్సు సర్వీస్‌ లను నిలిపివేస్తూ ధర్నాకు దిగారు..ఈ దర్నాకు అన్ని ఆర్‌.టి.సి యూనియన్‌ లు మద్దతు తెలుపుతున్నాయి..తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌,ఎంప్లాయిస్‌ యూనియన్‌,ఎస్‌.ఢబ్ల్యూ.ఎఫ్‌,టిజెఎమ్‌ తదితర యూనియన్స్‌ ఓకే తాటిపైకి వచ్చి ధర్నాను కొనసాగిస్తున్నాయి. ఆర్‌.టి.సి ఎంప్లాయిస్‌ ని కడుపులో పెట్టుకుని చూసే తెలంగాణ గవర్నమెంటు పంపిన గవర్నర్‌ అమోదం బిల్లుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ వెంటనే అమోదం బిల్లుపై సంతకం పెట్టి ఆర్‌.టి.సి ఎంప్లాయిస్‌ పట్ల విజ్ఞత చాటుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....