జగిత్యాల జులై 12, (ఇయ్యాల తెలంగాణ ): ఎస్‌ఎఫ్‌ఐ ,ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల
విద్యారంగ సమస్యల పరిష్కరించాలని కోరుతూఎస్‌ఎఫ్‌ఐ ,ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు బుధవారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా, ప్రతి మండల కేంద్రంలోని విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణలో భాగంగా బందు విజయవంతంగా జరిగిందని,ప్రైవేట్,కార్పొరేట్, ప్రభుత్వ, యాజమాన్యాలకుఉపాధ్యాయులకు,విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ సంఘం నేతలు కృతజ్ఞతలుతెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం ధ్యేయంగా భవిష్యత్తులో సమరశీల విద్యార్థి ఉద్యమ పోరాటాలకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. సమస్యల వలయంలో విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని, పూర్తిగా కార్పొరేట్ కు వత్తాసులు పలుకుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ విద్యావ్యవస్థనునీరుగాచుతున్నారన్నారు.అలాగే విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి అధికార లక్ష్యమే, ధ్యేయంగా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని మండి పడ్డారు..
ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి అక్రమ్, ఎస్‌ఎఫ్‌ఐ కన్వీనర్ బచల వినోద్, బిసీ సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ,ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వంశీ సంజయ్, జీవన్, సోహైల్ ,రంజిత్ ,రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ మహిళ కన్వీనర్ మనీషా, సుష్మా, స్వరాజ్ ,శిరీష, గౌతమి ,భుమేష్ ,అరుణ్ ,రాకేశ్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.