న్యూఢిల్లీ, మార్చ్ 19 (ఇయ్యాల తెలంగాణ) : జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు.. తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్‌కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చెరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్‌ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ రిలీజ్ చేసింది. బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి నియామకం అమలులోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ఆ రిలీజ్‌లో తెలిపింది.
- Homepage
- Telangana News
- జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు.. Telangana గవర్నర్‌గా అదనపు బాధ్యతలు
జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు.. Telangana గవర్నర్‌గా అదనపు బాధ్యతలు
Leave a Comment