జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కృషి

పెద్దపల్లి జూలై 4, (ఇయ్యాల తెలంగాణ ):ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అన్నారు. స్థానిక జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కేటాయింపు కొరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులు అందజేసిన వినతికి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే ఇళ్ల స్థలాల కేటాయింపుకు అధికారులతో మాట్లాడి స్థలం కేటాయింపుకు చర్యలు తీసుకుంటానని హావిూ ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు కొరకు ఇదివరకే సీఎంఓ కు నివేదిక సమర్పించడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. స్థానికంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీసం బిఎల్‌ఓ కింద స్థలం కేటాయింపు జరపాలని కోరగా, జర్నలిస్టుల ఇండ్ల స్థలం కేటాయింపుకు తప్పకుండా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే కు వినతి అందించిన వారిలో స్థానిక జర్నలిస్టులు ముస్త్యాల రవి కిషోర్‌, బి రాజేందర్‌, లైసెట్టి రాజు, ఎర్రోజు వేణుగోపాల్‌, పోగుల విజయ్‌ కుమార్‌, కొల్లూరి గోపాల్‌, అర్కుటి మల్లేష్‌, తిర్రి శంకర్‌, బి శ్రీనివాస్‌ గౌడ్‌, నాగులమల్యాల శివాచారి, ఆకుల రమేష్‌, రాజేందర్‌, టి మధుసూదన్‌ తదితరులు ఉన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....