చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా బండి సంజయ్‌

న్యూ డిల్లీ అక్టోబర్‌ 19 (ఇయ్యాల  తెలంగాణ );చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్‌ ప్రచారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నడ్డా, అమిత్‌ షా సహా 40 మందితో స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాను బీజేపీ విడుదల చేసింది.జేపీ నడ్డా నివాసంలో బీజేపీ తెలంగాణ కోర్‌ గ్రూప్‌ నేతల సమావేశం ముగిసింది. సమావేశంలో తరుణ్‌ ఛుగ్‌, ప్రకాష్‌ జవదేకర్‌, కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, డా. కే. లక్ష్మణ్‌, బండి సంజయ్‌, ఈటెల పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. నడ్డాతో భేటీకి ముందు జవడేకర్‌ నివాసంలో మధ్యాహ్నం నుంచి సుదీర్ఘ మంతనాలు జరిపారు.తెలంగాణ నుంచి కేవలం బండి సంజయ్‌ను మాత్రమే ఛత్తీస్‌ గఢ్‌ ఎన్నికల ప్రకాచారంలో బీజేపీ ఉపయోగించుకుంటోంది. నడ్డాతో గంట తర్వాత మరోసారి తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం కానుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....