చట్నీలో RAT మంత్రి దామోదర ఆగ్రహం

హైదరాబాద్‌ జులై 10 (ఇయ్యాల తెలంగాణ ):సంగారెడ్డి  జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్లో  చట్నీలో ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి మాట్లాడుతూ తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న హాస్టళ్లు, క్యాంటీన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహకులు, లైసెన్స్‌ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నిరంతరం హోటళ్లు, రెస్టారంట్లతో పాటు బేకరీలు, హాస్టళ్లు, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ మాధురి జేఎన్టీయూ క్యాంపస్లోని వంట గదిని పరిశీలించారు. వంటగతి అపరిశుభ్రంగా ఉండటంతో ప్రిన్సిపల్‌, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విూ ఇంట్లో ఇలాగే ఉంటుందా.? అని సిబ్బందిని నిలదీశారు. వెంటనే మెస్‌ కాంట్రాక్టర్ను మార్చాలని ఆదేశించారు. వందలాది మంది విద్యార్థులు తినే ఆహారం ఇలా అపరిశుభ్రంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. అంతకు ముందు విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోజూ తినే ఆహారంలో బొద్దింకలు, బల్లులు, ఎలుకలు కనిపిస్తూనే ఉన్నాయని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం తో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించాలని సిబ్బందికి సూచించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....