గ్రూప్‌`4 అభ్యర్ధులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి

హైదరాబాద్‌, జూన్‌ 24, (ఇయ్యాల తెలంగాణ):

తెలంగాణ రాష్ట్రంలో జులై 1న గ్రూప్‌`4 పోస్టులకు రాతపరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సారి గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్‌ తప్పనిసరి చేస్తూ టీఎస్‌పీఎస్సీ ప్రకటన వెలువరించింది. దీని ప్రకారంగా పేపర్‌`1, పేపర్‌`2 పరీక్షలకు అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే ఓఎంఆర్‌ పత్రాల్ని అందజేయనున్నారు. గ్రూప్‌ 1 పరీక్షకు బయోమెట్రిక్‌ తీసుకోకుండా పరీక్ష నిర్వహించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్‌ 4 పరీక్షలకు బయోమెట్రిక్‌ తప్పరిసరి చేసింది. ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 8,180 గ్రూప్‌`4 పోస్టులకుగానూ 9.51 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. భారీ సంఖ్యలో ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తుండటంతో జిల్లాకేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టీఎస్పీయస్సీ సమావేశాలు నిర్వహించింది. రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....