గోషామహల్‌ నియోజకవర్గం లో మంత్రి తలసాని అభివృద్ధి పనులు

హైదరాబాద్‌ ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ):గోషామహల్‌ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మంగళవారం పర్యటించారు. పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. గోషామహల్‌ నియోజకవరంలోని జాంబాగ్‌ , బేగం బజార్‌ డివిజన్‌ లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జాంబాగ్‌ లో మైనారిటీలు మంత్రిపై పూలజల్లుతూ వెల్కం చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ చేసే హావిూలన్నీ ఆచరణ సాధ్యం కానివే. ఓట్లను దండుకొనే లక్ష్యంతో అవగాహన లేకుండా హావిూలు ప్రకటిస్తున్నారు. కర్ణాటక లో ఇచ్చిన హావిూలు అమలు చేసి చూపెట్టండి. 50 సంవత్సరాలు పాలించారు కదా ప్రజలకు ఏం చేశారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ కాదు. అధికారం కోసం ఏ గడ్డి అయిన తింట్టం అన్నట్టుగా..రోజుకో డిక్లరేషన్‌ పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ డిక్లరేషన్‌ లు మూతి తుడుచుకోవడానికి కూడా పనికి రావని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....