గులాబీకి పతంగ్‌… దూరం…! BRS / AIMIM

హైదరాబాద్‌, జూలై 18, (ఇయ్యాల తెలంగాణ) : మజ్లిస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఈ పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ మాత్రమే ఉంటూ వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్‌, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీకి కూడా మంచి స్నేహం ఉన్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీతో సయోధ్య కుదుర్చుకునే పద్ధతిని మజ్లిస్‌ పార్టీ అవలంబించింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నప్పుడు ఇదే మజ్లిస్‌ పార్టీ ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉంటూ వచ్చింది. మొన్నటి వరకూ బీఆర్‌ఎస్‌తో సఖ్యంగానే మెలిగింది. కాంగ్రెస్‌ పార్టీ స్నేహ హస్తం అందించినా మజ్లిస్‌ పార్టీ మాత్రం సస్పన్స్‌లోనే పెట్టింది. కానీ, తాజాగా ఎంఐఎం పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ లేవనెత్తిన అంశాలు, బీఆర్‌ఎస్‌ పార్టీపై వేసిన ప్రశ్నలు చూస్తే.. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత చెడిరదా? అనే అనుమానాలు రాకమానవు.కొన్ని రోజులుగా బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. బిడ్డ కవితను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ.. బీజేపీ పెద్దలతో డీల్‌ కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్‌ కోసం కేటీఆర్‌, హరీశ్‌ రావులు స్వయంగా ఢిల్లీ కి వెళ్లారని, సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని, ఈ ఒప్పందంలో భాగంగా త్వరలోనే బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లుతారనే ప్రచారం కూడా జరిగింది. పలు విూడియా సంస్థలు ప్రముఖంగా వార్తలనూ ప్రచురించాయి. ఈ వార్తలను పేర్కొంటూ అసదుద్దీన్‌ ఒవైసీ బీఆర్‌ఎస్‌ పై ప్రశ్నలు కురిపించారు.బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందనే వార్తలు కొన్ని ఇంగ్లీష్‌ పత్రికల్లో వచ్చాయని, వాటిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్నదని అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. నిజంగానే బీఆర్‌ఎస్‌ పార్టీ.. బీజేపీలో విలీనం అవుతుందా? లేక బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకుంటుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు విూడియాలో వస్తున్నాయని, కాబట్టి, వీటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ పార్టీపై ఉన్నదన్నారు.రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ బీజేపీ, ఎంఐఎం ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉంటున్నాయి. 

బీజేపీకి వ్యతిరేకంగా ఎంఐఎం బరిలో నిలబడుతున్నది. తరుచూ ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మతపరమైన అంశాల్లో ఈ రెండు పార్టీలు తీవ్రంగా విభేదించుకుంటాయి. కాబట్టి, ఒక వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీతో జతకడితే.. కారు పార్టీకి దూరం జరిగే అవసరత ఎంఐఎం పార్టీకి ఏర్పడుతుంది. ఈ తరుణంలోనే అసదుద్దీన్‌ ఒవైసీ ఈ కీలక ప్రశ్నలను లేవదీసినట్టు అర్థం అవుతున్నది. ఎంఐఎంతో సత్సంబంధాన్ని కొనసాగించు కోవాలనుకుంటే, విూడియాలో వస్తున్న విలీన వార్తలు అవాస్తవాలే అయితే బీఆర్‌ఎస్‌ ఇది వరకే ఎంఐఎం పార్టీకి స్పష్టత ఇచ్చి ఉండేది. కానీ, అసదుద్దీన్‌ ఒవైసీ ఏకంగా విూడియాలో ఈ అనుమానాలు లేవనెత్తడంతో ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక అవగాహన ఎంతోకాలం కొనసాగేలా లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....