హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : సమాజ శ్రేయస్సు కోరే ప్రొఫెసర్ కోదండరామ్ కి సంత్ గురు రవిదాస్ మహారాజ్ దీవెనలు ఎల్లప్పుడు ఉంటాయని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చంద్రగిరి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఉదయం టీజేఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రొఫెసర్ కోదండరామ్ ని మర్యాద పూర్వకంగా కలసి సంత్ శీరోమణీ గురు రవిదాస్ మహారాజ్ యొక్క మెమంటోని బహూకరించారు. ఈ సందర్భంగా చంద్రగిరి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా సంక్షేమం కోరుకునే ప్రొఫెసర్ కోదండరామ్ కి రవిదాస్ మహారాజ్ ఆశీర్వాద గురు బలం ఎల్లప్పుడు ఉండాలని కోరుకునే వారిలో నేను ఒకరిని అని పేర్కొన్నారు.
- Homepage
- Telangana News
- గురు రవిదాస్ దీవెనలు – Prof కోదండరామ్ కు ఎల్లప్పుడు ఉంటాయి
గురు రవిదాస్ దీవెనలు – Prof కోదండరామ్ కు ఎల్లప్పుడు ఉంటాయి
Leave a Comment