కోర్ట్‌ మానిటరింగ్‌ సిబ్బంది విధులు చాలా కీలకం

జులై 8, (ఇయ్యాల తెలంగాణ ):  అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) నాగేశ్వరరావు 

 ఈ రోజు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) నాగేశ్వరరావు  పోలీస్‌ స్టేషన్ల  కోర్ట్‌ సిబ్బంది, కోర్ట్‌ లైజన్‌ సిబ్బందితో   సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ గారు కోర్టు కేసుల ట్రయిల్‌ వివిధ దశల్లో   ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని సమన్వయంతో అధిగమించేందుకు దోహదపడే పలు అంశాలపై పోలీసు అధికారులు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.  కేసుల ట్రయల్‌ సమయంలో కోర్టు సిబ్బంది గుడ్‌ ట్రయల్‌ మానిటరింగ్‌ ద్వారా  కన్విక్షన్ల శాతాన్ని పెంచాలన్నారు.కోర్ట్‌ లో చార్జ్‌ షీట్‌ దాఖలు చేసిన వెంటనే అఅ, ఖఖీఅ నంబర్స్‌ తీసుకోవాలని, సమన్లు సకాలంలో  అందజేయాలని, సాక్షులకు కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా మోటివేట్‌ చేయాలని, సాక్షుల వాంగ్మూలాలు, లేదా సాంకేతిక మరియు వైద్య అధారాను సేకరించి వాటి సరైన పద్దతిలో కోర్టుకు సమర్పించాలని, సంబంధిత పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తో సత్సంబంధాలు కొనసాగించి, ఆయా కేసులలో నేరస్తులకు శిక్ష పడే విధంగా శ్రమించాలని సూచించారు. అదే విధంగా వారెంట్స్‌ పెండిరగ్‌ లేకుండా చూసుకోవాలని, ప్రతి రోజు క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్లి కోర్టులో జరుగుతున్న ప్రాసెస్‌ సీసీడీలు, సమన్స్‌, వారెంట్స్‌ను, కోర్టు డిస్పోజల్‌, కన్విక్షన్‌, అక్విట్‌ తదితర సమాచారాన్ని క్రమం తప్పకుండా సీసీటీఎన్‌ఎస్‌లో ఎంట్రీ చేయాలని సూచించారు. కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, ఉన్నతాధికారులకు తెలియాజేయాలన్నారు. కోర్టు క్యాలెండర్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని, కేసు ట్రయల్స్‌ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు.పోలీసు స్టేషన్‌కు, న్యాయస్థానాల మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ   కోర్టు సిబ్బంది అంకితవంతో పనిచేస్తూ శిక్షల శాతం పెంచే విధంగా శ్రమించాలని, నిజాయితీ, నిబద్దతతో పనిచేసి పోలీస్‌ శాఖక  మంచి పేరు తీసుకురావాలని అదనపు ఎస్పీ గారు సూచించారు. శిక్షల శాతం పెరిగిన అప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని,  నేర రహిత సమాజ స్థాపన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....