కొమురవెళ్లి Hundi లెక్కింపులో ఉంగరం మాయం !

సిద్దిపేట, జూలై 18 (ఇయ్యాల తెలంగాణ) : కొమురవెళ్లి ఆలయ హుండీ లెక్కింపులో మాయమైన ఉంగరం ఘటన మలుపులు తిరుగుతోంది.ఏఈవో గంగ శ్రీనివాస్‌ పై ఆలయ ఈవో బాలాజీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఏఈవో పై ఈవో కొమురవెళ్లి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసారు.

బుధవారం  ఆలయ హుండీ లెక్కింపు చేస్తుండగా హుండీలో భక్తులు వేసిన బంగారు చైన్‌, ఉంగరం కనిపించాయి. వాటిని టేబుల్‌ పై పెట్టి ఏఈవో కి సమాచారమిచ్చి లంచ్‌ కి వెళ్లానని ఈవో చెబుతున్నారు. తిరిగి వచ్చిచూసేసరికి టేబుల్‌ పైన కాకుండా చెత్తకుప్పలో చైన్‌ పడివుంది.ఉంగరం మాయమైంది. ఘటన సమయంలో సిసి కెమెరా పని చేయలేదు. మిగతా అన్ని సిసి కెమెరాలు పని చేసి ఉంగరం ఉన్న టేబుల్‌ వద్ద సీసీ కెమెరా పని చేయకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....