కొత్త సూపర్‌ స్పెషాలిటీ Hospitals నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సవిూక్ష

నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని మంత్రి  దామోదర రాజనర్సింహ ఆదేశం .  

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల మంత్రి అ. దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌ లోని డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వరంగల్‌ లో 2100 బెడ్స్‌ సామర్థ్యంతో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, హైదరాబాద్‌ లోని అల్వాల్‌ లో నిర్మిస్తున్న 1200 బెడ్స్‌ సామర్ధ్యం కలిగిన టిమ్స్‌ ూ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, ఎల్బీనగర్‌ లో నిర్మిస్తున్న 1000 బెడ్స్‌ సామర్థ్యం గల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, సనత్‌ నగర్‌ లో నిర్మిస్తున్న 1000 బెడ్స్‌ సామర్థ్యం కలిగిన సూపర్‌  స్పెషాలిటీ హాస్పటల్‌ ల నిర్మాణ పనుల పురోగతి తో పాటు ఎర్రమంజిల్‌ లోని నిమ్స్‌  హాస్పిటల్‌ 2వేల బెడ్స్‌ సామర్ధ్యం తో నిర్మిస్తున్న విస్తరణ పనుల పురోగతిపై ప్రత్యేకంగా సవిూక్ష నిర్వహించారు.

ఈ సవిూక్ష సమావేశంలో కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రుల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఖీడ,ః శాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో పనుల పురోగతిపై చర్చించారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని  మంత్రి ఆదేశించారు. ఆస్పత్రిలో నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే తక్షణం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు  వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. వివిధ జిల్లాల నుండి హైదరాబాద్‌ నగరానికి మెరుగైన వైద్య సేవల కోసం వచ్చే రోగులకు అంధించే చికిత్సలపై టెక్నికల్‌ కమిటీని నియమించాలని ఆదేశించారు. టెక్నికల్‌ కమిటీ సూచించిన విధంగా ఆయా ఆస్పత్రులలో స్పెషాలిటీ సేవలను, చికిత్సలు అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు.  

ఈ సవిూక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా చోనీగ్తు,  మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ లు డా. వాణి, డా. శివరాం ప్రసాద్‌, వైద్య శాఖ ఉన్నతాధికారులు, ఖీడః ఇఔఅ గణపతి రెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు, కన్సల్టెంట్లు,  పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....