కొడంగల్‌ నుంచే పోటీ చేస్తా రేవంత్‌ రెడ్డి

రంగారెడ్డి ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ):దాడులు చేసి ఎన్నికల్లో గెలవలనుకునే వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. గురువారం నాడు కొడంగల్‌ లో అయన విూడియాతో మాట్లాడారు. కొడంగల్‌ ను దత్తత తీసుకుంటామని ఆనాడు కేసీఆర్‌ మాట ఇచ్చి మోసం చేశారు. హైదరాబాద్‌`బీజాపూర్‌ హైవే తెచ్చింది నేను. కొడంగల్‌ లో కట్టిన గుడి, బడి అన్నీ నా హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే. కొడంగల్‌ కు తాగునీరు తెచ్చి దాహార్తిని తీర్చింది నేను కాదా ? కొడంగల్‌ నియోజకవర్గానికి 30 సబ్‌ స్టేషన్లు తెచ్చింది మేమని అన్నారు.కొడంగల్‌ ప్రజలకు బస్‌ డిపో తెచ్చింది మేము. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి మా హయాంలోనే జరిగింది. బీఆరెస్‌ హయాంలో నారాయణ్‌ పేట్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేయకుండా కొడంగల్‌ కి అన్యాయం చేశారు. నేను చేసిన పనులకు శిలాఫలకాలు వేయడం తప్ప బీఆరెస్‌ చేసిందేం లేదు. జిల్లాలు పెంచి కొడంగల్‌ ను ముక్కలు చెక్కలు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ దత్తత తీసుకుంటే కొడంగల్‌ కు ఏం జరిగింది? రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి కాళ్లు కడుగుతామని కేసీఆర్‌ అనలేదా. ఐదేళ్లయినా ఎందుకు తీసుకురాలేదు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌ కట్టకుండా కొడంగల్‌ కు నీళ్లు రావు. కనీసం మండల కేంద్రాల్లో జూనియర్‌ కాలేజీలను కూడా నిర్మించలేదు. మరోసారి కొడంగల్‌ ప్రజలను మోసం చేయాలని బీఆరెస్‌ భావిస్తోంది. విూరు దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరు. విూరు చేతితో కొడితే.. ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొడతారు. దాడులు చేయడం మా విధానం కాదు… అభివృద్ధి చేయడమే మా విధానం. పేదల జీవన ప్రమాణాలు పెంచి  రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే మా విధానం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందించడమే మా విధానం. ప్రతీ నెలా మొదటి తారీఖున రూ.4వేలు పెన్షన్‌ ఇవ్వడం మా విధానం. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు సాయం చేయడం మా విధానం. రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ అందించి ఆడబిడ్డలను ఆదుకోవడం మా విధానం. కేసీఆర్‌ ఒడిపోతుండు కాబట్టే గజ్వేల్‌ నుంచి పారిపోతుండు. కేసీఆర్‌ ఓటమి ఖాయమైంది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతుండు. ఓటమి భయం కేసీఆర్‌ గొంతులో స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్‌ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుంది… హైదరాబాద్‌ చుట్టూ 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. గుర్నాథ్‌ రెడ్డి సూచనతో నేను కొడంగల్‌ నుంచే పోటీకీ ఇవాళ గాంధీభవన్‌ లో దరఖాస్తు చేస్తాం. విూరంతా ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. ..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....