కూకట్‌ పల్లిలో కాంగ్రెస్‌ కు సీనియర్‌ నేత రాజీనామా

రంగారెడ్డి  అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ ):కూకట్‌ పల్లి నియోజకవర్గంలో  కాంగ్రెస్‌ పార్టీ కి షాక్‌ తగిలింది.  కాంగ్రెస్‌ పార్టీ మాజీ కార్పొరేటర్‌, పీసీసీ సభ్యులు గొట్టిముక్కల వెంగళ్‌ రావు పార్టీకి రాజీనామా చేసారు. కూకట్‌ పల్లి నుండి కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ గొట్టిముక్కల వెంగళ్‌ రావు ఆశించిన విషయం తెలిసిందే.  శుక్రవారం  విడుదలైన కాంగ్రెస్‌ పార్టీ 2 వ లిస్ట్‌ లో కూకట్‌ పల్లి  నుండి పార్టీ అభ్యర్థిగా బండి రమేష్‌ ను అధిష్టానం ప్రకటించింది. దాంతో కాంగ్రెస్‌ పార్టీ కి వెంగళ్‌ రావు రాజీనామా చేసారు. వెంగళరావు విూడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. 40 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని ఉంటే అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బండి రమేష్‌ కి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లో అడ్డుకుంటామని అయన అనుచరులు వెల్లడిరచారు.బండి రమేష్‌ గో బ్యాక్‌, గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేసారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....