కులమతాలకు అతీతంగా యోగ : వెంకయ్యనాయుడు

 

హైదరాబాద్‌, జూన్‌ 21, (ఇయ్యాల తెలంగాణ) :  8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ కార్యక్రామానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు.. సినీ నటుడు అడవి శేషు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు యోగాసనాలు వేశారు.అనంతరం ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘యోగా అంటే సాధన చేయడం, ఏకాగ్రతను సాధించడం. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుంది. యోగా కులమతాలకు అతీతమైంది, యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక. ప్రపంచదేశాల్లో శాంతికి దోహదం చేస్తుంది, దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ యోగా చేయాలి. ఏ స్థాయిలో ఉన్నా యోగా తప్పనిసరి సాధన చేయాలి. కొంత సమయమైనా యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిది’ అని వెంకయ్య చెప్పుకొచ్చారు.

పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయాలి? కిషన్‌ రెడ్డి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ కచ్చితంగా యోగా చేయాలి. యోగాను అందరూ అలవాటు చేసుకోవాలి. పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా చేయడం ఎంతో ఉత్తమం’ అని కిషన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....