కుక్కల దాడుల నియంత్రణకు Plan

హైదరాబాద్‌, జూలై  25  (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ పరిధిలో ఈ మధ్య వీధి కుక్కల వల్ల తలెత్తుతున్న సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నారుల పైన వీధి శునకాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే, పసి పిల్లలను కూడా కుక్కలు చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు తమ పిల్లలను రోడ్లపై ఆటలకు పంపేందుకు సైతం జంకుతున్నారు. ఎటు వైపు నుంచి ఏ వీధి కుక్క వచ్చి దాడి చేస్తుందో అని భయపడిపోతున్నారు.‘విూ ఏరియాలో కుక్కల బెడద ఉందా? అయితే, టోల్‌ ఫ్రీ నంబర్లు 040`21111111, 040`23225397కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయండి. మా డాగ్‌ క్యాచింగ్‌ టీంలు నేరుగా వచ్చి వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్‌ చేస్తాయి’’ అని జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది.ఒక్క హైదరాబాద్‌లోనే 4 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు సమాచారం ఉందని ఈ మధ్యే ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వెల్లడిరచింది. తెలంగాణలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు కరుస్తు?న్న ఘటనలు జరుగుతున్నాయని వీటిని నియంత్రించాలని ఈ మధ్యే ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. భారత జంతు సంక్షేమ సంఘం గైడ్‌ లైన్స్‌ ఏమాత్రం ఆచరణయోగ్యంగా లేవని.. ప్రజల ప్రాణాల కన్నా కుక్కల ప్రాణాలకే ప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. కుక్కలను మానవతా దృక్పథంతో చూడాలని అనడంలో అభ్యంతరం లేదని అన్నారు. తెలంగాణలో ప్రమాదకరంగా ఉన్న ఈ వీధి కుక్కలను నిర్మూలించడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరింది.

సీఎం రేవంత్‌ సవిూక్ష

వీధి కుక్కలు పిల్లల్ని కరుస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో ఇటీవల హైకోర్టు కూడా సుమోటోగా విచారణ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్‌ఎంసీకి కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కుక్కల సమస్యపై గత సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సవిూక్ష కూడా చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....