కుందారం కెనాల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

జనగామ ఆగష్టు 2 (ఇయ్యాల తెలంగాణ ): లింగాల ఘనపురం మండలం కుందారం కెనాల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఎర్టిగా వాహనం అతివేగంగా చెట్టును ఢీ కొట్టింది. చెట్టును బలంగా ఢీకొనడంతో వాహనం నుజ్జునుజ్జు అయిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను108 వాహనంలో చికిత్స నిమిత్తం స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు సింధూజగా గుర్తించారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....