కార్యకర్తలను కలుసుకుంటూ? ఛాయ్‌, సమోసలు తింటూ.. మంత్రి పొన్నం MORNING WALK

హుజురాబాద్‌ జులై 3 (ఇయ్యాల తెలంగాణ );మంత్రి పొన్నం ప్రభాకర్‌  హుజురాబాద్‌ నియోజకవర్గంలోని  జమ్మికుంటలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల తో కలిసి ఓ హోటల్‌ లో చాయ్‌ తాగారు. జమ్మికుంట పట్టణం లోని డాల్ఫిన్‌ హోటల్‌ లో కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలతో కలిసి సమోసాలు తింటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే జమ్మికుంటకు వస్తానని  మార్నింగ్‌ వాకింగ్‌ లో పట్టణ  ప్రజలు కలుస్తానని కాంగ్రెస్‌ నాయకులకు తెలియజేశారు. జమ్మికుంట కు  మంత్రి పొన్నం ప్రభాకర్‌  రావడంతో కార్యకర్తల్లో మంచి ఉత్సాహంతో మంత్రి పొన్నంకు కరచాలనం చేస్తూ ఆనందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌  వెంట సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....