కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తా

హైదరాబాద్‌ జూలై 10, (ఇయ్యాల తెలంగాణ ): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తానా సభల్లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామన్నారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్‌ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపడితే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్‌ను ఎన్నారైలు కోరారు. దీనికి సమాధానంగా రేవంత్‌.. అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పేదల పక్షాన, ఎస్సీ, ఎస్టీల పక్షాన నిలుస్తుందన్నారు. దళితుడైన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వచ్చేసి దళితులు, గిరిజనులకు అనుకూలంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు కావొచ్చన్నారు. పని చేసే వారికి గౌరవం కచ్చితంగా దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పైరవీలు చేసుకోవాల్సిన అవసరం లేదని రేవంత్‌ అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....