కాంగ్రెస్‌ గూటికి K K

హైదరాబాద్‌  జూలై 3, (ఇయ్యాల తెలంగాణ ):బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. రేంత్‌ రెడ్డితో కలిసి ఢల్లీి వెళ్లిన ఆయన .. మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారు. అంతకు ముందే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే పార్టీ మారితే అనర్హతా వేటు పడుతుంది. అందుకే రాజీనామా చేయాలనుకుంటున్నారు. 2020లో బీఆర్‌ఎస్‌ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇంకా రెండేళ్లకుపైగా పదవి కాలం ఉంది. అయితే రాజీనామా చేయడం వల్ల వచ్చే ఉపఎన్నిక ద్వారా ఆయన మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆ షరతు విూదనే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. కేకే కుమార్తె , హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే కాంగ్రెస్‌ లో చేరారు. కేకే కుమారుడు విప్లవ్‌ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారు. కేసీఆర్‌ స్వతహాగా కాంగ్రెస్‌ నేత. ఆయన పలుమార్లు పీసీసీ చీఫ్‌ గా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క సారే గెలిచారు. తర్వాత ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఆయనకు పదవులు మాత్రం వస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత … తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోవడం.. కాంగ్రెస్‌ బలహీనపడటంతో ఆయన బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఆయనకు  మంచి పదవి ఇచ్చి..  కేసీఆర్‌ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అధికారం పోగానే ఆయన పార్టీ మారిపోయారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాత  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బంజారాహిల్స్‌ లోని కేశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. గత మార్చిలో ఈ ఆహ్వానం ఇచ్చారు. తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలు ఉండంతో చేరిక ఆగిపయోయింది. ఆయన కుమార్తె మాత్రం కాంగ్రెస్‌ లో చేరిపోయారు. ఇప్పుడు ఆయన  బీఆర్‌?స్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో అధికారికంగా చేరకపోవడంతో సమస్య అయింది. ఇప్పుడు ఎమ్మెల్యేల బలం కూడా ఉన్నందున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే ఉపఎన్నికల్లో మరోసారి పదవి పొందవచ్చన్న నమ్మకంతో రాజీనామాకు సిద్ధమయ్యారు.బీఆర్‌ఎస్‌ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నేతలు కూడా చేరుతున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ లీడర్లు పోయినా అలాంటి వాళ్లను వంద మందిని తయారు చేసుకుంటామని.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు 160 అవుతాయని అందరికీ అవకాశం దక్కుతుందని బుజ్జగిస్తున్నారు. కానీ కాంగ్రెస్‌ మాత్రంమ బలంగా ఆకర్షన్‌ ను ప్రయోగిస్తోంది.    

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....