కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా

 
న్యూఢల్లీ ఆగష్టు 2 (ఇయ్యలతెలంగాణ ): కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా పడిరది. ఈరోజు (బుధవారం) జూపల్లి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి హస్తం పార్టీ తీర్థంపుచ్చుకోవాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో జూపల్లి చేరిక ఈరోజు జరగలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లురవి ప్రకటించారు. తిరిగి రేపు అనగా గురువారం ఉదయం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు, కూచుకుల్లా రాజేష్‌ రెడ్డి, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాధ్‌ రెడ్డిలతో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. త్వరలోనే బీజేపీ నుంచి చేరికలు ఉంటాయని చెప్పారు. రాజకీయ పునరేకికరణలో భాగంగా రానున్న రోజుల్లో భారీగా చేరికలు ఉంటాయన్నారు. కొల్లాపూర్‌లో త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సీనినటి,మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరడం ఆమె వ్యక్తిగత నిర్ణయమని.. దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని మల్లురవి పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....