కళ్యాణ లక్ష్మి CHECKS ఆగస్టు వరకు గడువు ఈలోపే లబ్ధిదారులకు అందిస్తాం..

హైదరాబాద్‌ జూన్ 27 (ఇయ్యాల తెలంగాణ )2024 లబ్ధిదారులకు అందిస్తాం. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్‌, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల గడువు ముగుస్తోందన్న వాదనలో నిజం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది .అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందిస్తామని తెలిపింది. ఇప్పటికే 71 చెక్కులను పంపిణీ చేసినట్లు హైకోర్టు దృష్టికి తెచ్చింది. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాల చెక్కుల కాలపరిమితి ఈనెల 27తో ముగియనున్నందున వాటి పంపిణీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం మరోసారి జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదిస్తూ ఈ చెక్కులకు ఆగస్టు వరకు సమయం ఉందని తెలిపారు. ఒక్క చెక్కు కూడా మురిగిపోదని, లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. వివరాలతో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ఏఏజీ కోరడంతో తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....